https://oktelugu.com/

తిరుపతి ఉపఎన్నిక: అగమ్యగోచరంగా పవన్‌ కళ్యాణ్ పరిస్థితి

బీజేపీ హైకమాండ్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎదురుచూపులు తప్పలేదు.ఒకటి కాదు రెండు కాదు.. మూడు రోజులు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. మూడు రోజులకు చర్చలకు ఆహ్వానించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దాదాపు గంటసేపు మాట్లాడారు. ఈ పర్యటనలో పవన్‌ వెంట నాదెండ్ల భాస్కర్‌‌ కూడా ఉన్నారు. అయితే.. పవన్‌ పర్యటన వెనుక తిరుపతి ఉప ఎన్నిక అంశామే ప్రధానంగా ఉందని ప్రచారం జరిగింది. తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 08:37 AM IST
    Follow us on

    బీజేపీ హైకమాండ్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎదురుచూపులు తప్పలేదు.ఒకటి కాదు రెండు కాదు.. మూడు రోజులు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. మూడు రోజులకు చర్చలకు ఆహ్వానించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దాదాపు గంటసేపు మాట్లాడారు. ఈ పర్యటనలో పవన్‌ వెంట నాదెండ్ల భాస్కర్‌‌ కూడా ఉన్నారు.

    అయితే.. పవన్‌ పర్యటన వెనుక తిరుపతి ఉప ఎన్నిక అంశామే ప్రధానంగా ఉందని ప్రచారం జరిగింది. తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి బరిలోకి దిగుతాడనే విషయాన్ని ఖరాకండిగా చెప్పేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని వార్తలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీకి జనసేనకు అవకాశం ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరుతున్నట్లు జనసేన, బీజేపీ నేతలు బాహాటంగానే చెప్పారు. నడ్డాతో భేటీ అయ్యాక కూడా ప్రధానంగా ఇదే విషయం చర్చకు వచ్చిందని చానళ్లూ కోడై కూసాయి. కానీ.. ఈ విషయంపై జనసేనాని పవన్‌ క్లారిటీ ఇచ్చేశాడు.

    Also Read: రచ్చకెక్కిన అధికారపార్టీ విభేదాలు.. అధినేత సీరియస్

    అయితే.. ఈ క్లారిటీ విషయంలో పవన్‌ కల్యాణ్‌ మాటలు ఒకలా ఉంటే.. మరో నేత నాదెండ్ల భాస్కర్‌‌ చేసిన వ్యాఖ్యలు ఇంకో విధంగా ఉన్నాయి. తిరుపతి అభ్యర్థి విషయంపై చర్చించేందుకు ఢిల్లీ రాలేదని నాదెండ్ల చెప్పగా.. తిరుపతి అభ్యర్థి విషయం మీదనే చర్చించేందుకు వచ్చామని పవన్‌ చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు.

    సమావేశంలో ప్రధానంగా తిరుపతి బైపోల్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడామని, ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించామని ఆయన చెప్పారు. అయితే, రెండు పార్టీలు కలిసి దీనిపైఓ కమిటీ వేద్దామని నడ్డా చెప్పారని, సదరు కమిటీ రిపోర్టుల తర్వాత తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉండాలా? లేక బీజేపీ అభ్యర్థి ఉండాలా? అన్నది ఖరారవుతుందని, ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ నిర్ణయం తేలిపోతుందని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంతోపాటే ఏపీ ప్రధాన సమస్యలైన అమరావతి తరలింపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు తెలిపారు. 60 నిమిషాలపాటు సాగిన భేటీలో.. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేనలు కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై మాట్లాడుకున్నామని, అదే సమయంలో జగన్ సర్కారు చేస్తున్న అవినీతి అక్రమాలు, దేవాలయాలపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యం తదితర అంశాలపైనా నడ్డాతో చర్చించినట్లు జనసేనాని చెప్పారు. రాజధాని అమరావతిలో రైతులు చేస్తున్న పోరాటానికి బీజేపీ అండగా ఉందని నడ్డా హామీ ఇచ్చినట్లు పవన్ పేర్కొన్నారు.

    Also Read: అయోధ్య శ్రీరాముడితో బీజేపీ మరో సంచలనం

    అయితే.. పవన్‌తోపాటే మీడియాతో మాట్లాడిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. నడ్డాతో తిరుపతి టికెట్ గురించే మాట్లాడానని పవన్ చెప్పగా.. నాదెండ్ల మాత్రం తిరుపతి ఉప ఎన్నిక కోసం ఢిల్లీ పర్యటనకు రాలేదన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే తాము ఢిల్లీ పర్యటన చేపట్టామని, రాజధాని అమరావతి, పోలవరం అంశాలపై నడ్డాతో చర్చించామని అన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చడం సరికాదని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నది జనసేన నిర్ణయమని మనోహర్ స్పష్టం చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్