బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా వుడ్ ల్యాండ్ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం ఆయనకు యాంజియో ప్లాస్టీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ వార్త తెలియనగా ఆయన అభిమానులు, క్రికెటర్లు షాక్ నకు గురయ్యారు. కరోనా సమయంలో కూడా ఐపీఎల్ నిర్వహించిన శభాష్ అనిపించుకున్న గంగూలీ ఇలా గుండెపోటు రావడంతో క్రికెట్ ప్రపంచం ఆందోళన చెందింది. కాగా ప్రస్తుతం డాక్టర్ సరోజ్ మోండల్ పర్యవేక్షనలో గంగూలీ చికిత్స పొందుతున్నారు. సాయంత్రం ఆయనకు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.