ఏపీలో బీజేపీ–జనసేన మిత్రపక్షం. ఇది మొన్నటివరకు మాట. కానీ.. ఇప్పుడు ఏమైందో ఏమో.. ఏ విషయంలో తేడాలు కొట్టాయో కానీ జనసేనపై ఏపీ బీజేపీ సీరియస్‌గా ఉంది. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలోనే ఈ రెండు పార్టీల మధ్య ఈ విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేనను బీజేపీ కూరలో కరివేపాకులా తీసేస్తుండడంతో జనసైనికులు ఫైర్ మీద ఉన్నారట. మరోవైపు అధిష్టానం హామీ ఇచ్చినా.. రాష్ట్ర నేతలు ఇంకో విధంగా మాట్లాడడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారట.
Also Read: శ్రీరాముడి చుట్టే ఏపీ రాజకీయాలు..: రామతీర్థానికి చంద్రబాబు
మరికొద్ది రోజుల్లో తిరుపతికి బై పోల్ జరగబోతోంది. అయితే.. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థినే బరిలో ఉంటారని, ఆ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తమ అధినేత పవన్‌కల్యాణ్‌కు హామీ ఇచ్చారని జనసేన నాయకులు చెబుతున్నారు. అందుకే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో నుంచి తప్పుకొని సంపూర్ణ మద్దతుగా నిలిచామని అంటున్నారు.
రాష్ట్ర బీజేపీ శాఖ జాతీయ అధ్యక్షుడి హామీని మరిచి ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితర నాయకులు కూడా తిరుపతి బరిలో బీజేపీనే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. దీనిని జనసేనకులు తట్టుకోలేకపోతున్నారు. సోము వీర్రాజు సహా మరికొందరు నాయకుల విధానాలపై జాతీయ అధ్యక్షుడు నడ్డాకు గత నెలలో పవన్‌కల్యాణ్ ఫిర్యాదు చేసినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చినజీయర్ ఫైర్
అందుకే.. బీజేపీ నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిచిందని జనసేన నేతలు అంటున్నారు. మిత్రపక్షమైన తమ అభిప్రాయాలు, ఆకాంక్షలకు కనీస గౌరవం ఇవ్వకుండా సోము వీర్రాజు, తదితరులు మాట్లాడారని, తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీనే నిలుస్తుందని పదేపదే చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ పెట్టి ఆరేడేళ్లు అవుతున్నా, ఇంత వరకూ జనసేనకు బూత్‌లెవల్ నాయకులు కూడా లేరని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. కేవలం కుల బలాన్ని చూసి పార్టీ బలంగా భ్రమ పడుతున్నారని విమర్శిస్తున్నారు. అన్యాయంగా తమ నాయకులపై ఢిల్లీకి ఫిర్యాదు చేశారని, వాస్తవాలేంటో అక్కటే తేల్చుకుందామని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్