రాజస్థాన్ లో గుర్జార్ల ఆందోళనలు తీవ్రతరం

రాజస్థాన్ లో గుర్జార్ల ఆందోళనలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని గుర్జార్లు ప్రభుత్వానితో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని ఆదివారం వరకు అల్టీమేటం విధించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఈ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనలో భాగంగా పెద్ద ఎత్తున యువకులు రైళ్లను అడ్డుకున్నారు. దీంతో జైపూర్ తో పాటు ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కాగా ఆందోళన […]

Written By: Suresh, Updated On : November 2, 2020 3:32 pm
Follow us on

రాజస్థాన్ లో గుర్జార్ల ఆందోళనలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని గుర్జార్లు ప్రభుత్వానితో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని ఆదివారం వరకు అల్టీమేటం విధించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఈ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనలో భాగంగా పెద్ద ఎత్తున యువకులు రైళ్లను అడ్డుకున్నారు. దీంతో జైపూర్ తో పాటు ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కాగా ఆందోళన కారణంగా హజ్రత్ నిజాముద్దీన్- కోటా, బాంద్రా టెర్మినస్- ముజఫర్పూర్ తో పాటు పలు రైళ్ల సేవలు నిలిచిపోయాయి.