
స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుడు లోక్‌నాయక్ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం లోక్‌నాయక్ జయంతి సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారతదేశ ప్రజాస్వామిక విలువలపై దాడులు జరుగుతున్న వేళ వాటిని కాపాడేందుకు లోక్‌నాయక్ ఎంతో కృషి చేశారన్నారు. జాతి ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.