
ఇటీవల గుండెపోటుతో కోల్ కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం డిశ్చార్జి కానున్నట్లు వుడ్ ల్యాండ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అయితే ఆయన రేపు డిశ్చార్జి కావాలనుకుంటున్నారని తెలిపారు. వైద్య పరంగా అతను ఫిట్ గా తయారయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం గంగూలీ సరోజ్ మండల్, సౌతిక్ పాండా, సప్తర్షి బసు వైద్య బ్రుందం చికిత్స అందిస్తోంది. ఈనెల 2న గంగూలీ వ్యాయామం చేస్తుండగా గుండెపోటు వచ్చింది.