ప్యాకేజీ పవన్‌..: ఆ ముద్ర పోయేదెలా..!

పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రాన్ని ఏలేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. తన అన్న చిరంజీవి లాగే పార్టీని స్థాపించారు. ఎంతో ఆవేశంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో అయితే తన స్పీచ్‌లతో హీట్‌ పుట్టించారు. కానీ.. ఏం లాభం. చివరకు ఆయనకు ఆయననే గెలువలేకపోయారు. ఇక ఇప్పుడేమో ప్యాకేజీ నేతగా ముద్రపడిపోయారు. Also Read: ఆ ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదట..: ఎందుకంటే..? ఈ విమర్శలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఆ ముద్ర నుంచి పవన్‌ తప్పించుకోలేకపోతున్నారు. నిజానికి […]

Written By: Srinivas, Updated On : January 6, 2021 12:04 pm
Follow us on


పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రాన్ని ఏలేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. తన అన్న చిరంజీవి లాగే పార్టీని స్థాపించారు. ఎంతో ఆవేశంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో అయితే తన స్పీచ్‌లతో హీట్‌ పుట్టించారు. కానీ.. ఏం లాభం. చివరకు ఆయనకు ఆయననే గెలువలేకపోయారు. ఇక ఇప్పుడేమో ప్యాకేజీ నేతగా ముద్రపడిపోయారు.

Also Read: ఆ ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదట..: ఎందుకంటే..?

ఈ విమర్శలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఆ ముద్ర నుంచి పవన్‌ తప్పించుకోలేకపోతున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడా? లేదా? అనేది పక్కన పెడితే యాధృచ్ఛికంగా జరిగిందో? లేదో? తెలియదు కాని ఆయన వ్యవహారం చూస్తే అనుమానం కలగక మానదు. పవన్ కల్యాణ్‌, నారా లోకేష్ ఒకే అంశంపై పర్యటనలు చేయడం ఇందుకు మరింత ఊతమిచ్చింది. రైతు సమస్యలపై పవన్ కల్యాణ్ మచిలీపట్నం పర్యటన చేపట్టారు. నివార్ తుపాను బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలనేది ప్రధాన డిమాండ్‌. కానీ.. నివార్ తుపాను వచ్చిన సందర్భంలోనే ముఖ్యమంత్రి జగన్ డిసెంబర్ 31వ తేదీలోగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో కూడా జగన్ ఇదే విషయాన్ని చెప్పారు. కానీ నష్టపరిహారం చెల్లించడానికి ఒకరోజు ముందు పవన్ కల్యాణ్ మచిలీపట్నం వచ్చి కలెక్టర్‌‌కు వినతిపత్రం ఇచ్చారు.

రైతు సమస్యల కోసం వచ్చిన పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ తీసుకునే వచ్చారని ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి మంత్రుల వరకూ విమర్శించారు. పవన్ కల్యాణ్ పర్యటన కాకతాళీయంగా జరిగినప్పటికీ ఆయనపై ప్యాకేజీ ముద్రను వైసీపీ నేతలు బలంగా వేస్తారు. తిరుపతి ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ పోటీ చేస్తామని చెప్పడం వెనక టీడీపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడం కోసమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉండాలన్నది పవన్ కోరుకుంటున్నారని అంటున్నారు.

Also Read: ఏపీలో దేవాలయాలపై దాడులు.. కేంద్రం జోక్యం?

పవన్‌ కల్యాణ్‌ గత ఎన్నికల వేళ టీడీపీతో జతకట్టారు. ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారు. కానీ.. ఆయనపై తెలుగుదేశం పార్టీ అనుకూల ముద్ర మాత్రం చెరిగిపోలేదు. మరోవైపు ఆయన వైఖరి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్లాలని గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. అందుకు ఇంకా సమయం ఉందని, పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి బీజేపీతోనే కలిసి వెళ్లే ఆలోచనలో ఉన్నారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి పవన్‌ రాజకీయంపై ఎవరికి ఎలాంటి క్లారిటీ మాత్రం దొరకడం లేదు. దీనికితోడు ఆ ప్యాకేజీ ముద్ర తొలగించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది కూడా ఆసక్తికరం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్