కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు అమెరికాలోనూ కొనసాగుతున్నాయి. నిరసనలో భాగంగా శనివారం భారత రాయభార కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేశారు. విగ్రహానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ విగ్రహంపై పసుపు జెండాను కప్పి ఉంచారు. ఈ ఘటనకు పాల్పడింది ఖలిస్తాన్ వేర్పాటు వాదులని తెలుస్తోంది. నిరసనలో భాగంగా ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఈ ఘటనపై భారత రాయభార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. నిందితులపై ముందస్తు దర్యాప్తు కోసం అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అయితే నిరసనకారుల్లో కొందరు భారత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా శాంతియుతంగానే నిరసన తెలిపామంటున్నారు.