పీసీసీ లొల్లి.. ఢిల్లీకి క్యూ కడుతున్న సీనియర్లు..!

కాంగ్రెస్ లో సీఎం పదవీకి ఉన్నంత డిమాండ్ టీపీసీసీ పదవీ ఏర్పడింది. టీపీసీసీ చీఫ్ అనేది సీఎం కుర్చీకి దగ్గరి దారికావడంతో కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఆ పోస్టుపై కన్నేశారు. ఇటీవల టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవీని దక్కించుకునేందుకు నేతలంతా అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. Also Read: ‘పెళ్లికాని ప్రసాద్’ ల బాధ ఇదీ! టీపీసీసీ కోసం పెద్దసంఖ్యలో పోటీపడుతుండటంతో అధిష్టానం సైతం అభిప్రాయ సేకరణ చేపట్టింది. గత […]

Written By: Neelambaram, Updated On : December 13, 2020 12:29 pm
Follow us on

కాంగ్రెస్ లో సీఎం పదవీకి ఉన్నంత డిమాండ్ టీపీసీసీ పదవీ ఏర్పడింది. టీపీసీసీ చీఫ్ అనేది సీఎం కుర్చీకి దగ్గరి దారికావడంతో కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఆ పోస్టుపై కన్నేశారు. ఇటీవల టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవీని దక్కించుకునేందుకు నేతలంతా అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.

Also Read: ‘పెళ్లికాని ప్రసాద్’ ల బాధ ఇదీ!

టీపీసీసీ కోసం పెద్దసంఖ్యలో పోటీపడుతుండటంతో అధిష్టానం సైతం అభిప్రాయ సేకరణ చేపట్టింది. గత నాలుగురోజులుగా ఈప్రక్రియ కొనసాగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ లోని ముఖ్యనేతలు.. అన్ని జిల్లాల అధ్యక్షులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకొని నిన్న సాయంత్రమే ఢిల్లీకి వెళ్లారు.

కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను అధిష్టానానికి మాణిక్యం ఠాకూర్ నివేదించనున్నారు. ఈక్రమంలోనే నేతలు టీపీసీసీపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు సీనియర్ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ వాదనను విన్పించేందుకు సిద్ధమవుతోన్నారు. నేడు హస్తినకు వెళ్లే వారిలో మల్లు భట్టి విక్రమార్క.. జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీధర్ బాబు ఉన్నారని సమాచారం.

Also Read: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఏం చర్చించారు?

కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని హైదరాబాద్లో చెప్పిన నేతలు చివరి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తమకు టీపీసీసీ ఇవ్వకపోయినా పర్వాలేదుగానీ బయటి నుంచి పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం టీపీసీసీ ఇస్తే సహించేది లేదంటున్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లే నాయకులకు పీసీసీ దక్కుతుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సాములా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్