’బంద్ ‘కు సంపూర్ణ మద్దతు: కాంగ్రెస్ ప్రకటన

కేంద్రప్రభుత్వ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలో భాగంగా ఈనెల 8న భారత్ బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా దేశీయ కాంగ్రెస్ బంద్ కు మద్దతు నిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిథి పవన్ ఖేరా ఆదివారం మీడియాకు తెలిపారు. రైతులకు మద్దతుగా తాము బంద్ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులను కేంద్రం హడావిడిగా పార్లమెంట్లో ఆమోదించడం వెనుక ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయన్నారు. రైతుల […]

Written By: Suresh, Updated On : December 6, 2020 3:35 pm

CongressFlag

Follow us on

కేంద్రప్రభుత్వ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలో భాగంగా ఈనెల 8న భారత్ బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా దేశీయ కాంగ్రెస్ బంద్ కు మద్దతు నిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిథి పవన్ ఖేరా ఆదివారం మీడియాకు తెలిపారు. రైతులకు మద్దతుగా తాము బంద్ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులను కేంద్రం హడావిడిగా పార్లమెంట్లో ఆమోదించడం వెనుక ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయన్నారు. రైతుల దుస్థితిని యావత్ ప్రపంచం చూస్తోందని, ప్రభుత్వం తమ గోడు వింటుందేమోనని ఆశతో చలిగాలుల్లో అర్ధరాత్రులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతులు గత 11 రోజులుగా రైతులు నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవడం లేదన్నారు. ప్రభత్వం, కార్పొరేట్ మిత్రలు మధ్య సాగిన కుట్ర ఫలితమే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.