కాంగ్రెస్ లో చిచ్చుపెడుతున్న టీపీసీసీ.. తీరుమార్చుకోని నేతలు..!

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేతల తీరుమారడం లేదు. టీపీసీసీ పదవీకి సరైన అభ్యర్థిని ప్రకటించి శ్రేణుల్లో జోష్ నింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ప్రకటన కంటే ముందే రేసులో మేమున్నమంటూ సీనియర్ నేతలు ప్రకటించుకోవడం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. Also Read: వ్రతం చెడ్డా పవన్ కు ఫలితం దక్కలేదా? అసెంబ్లీ.. పార్లమెంట్.. మున్సిపల్.. పంచాయతీ.. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికలను […]

Written By: Neelambaram, Updated On : December 6, 2020 4:14 pm
Follow us on

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేతల తీరుమారడం లేదు. టీపీసీసీ పదవీకి సరైన అభ్యర్థిని ప్రకటించి శ్రేణుల్లో జోష్ నింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ప్రకటన కంటే ముందే రేసులో మేమున్నమంటూ సీనియర్ నేతలు ప్రకటించుకోవడం కాంగ్రెస్ లో కాకరేపుతోంది.

Also Read: వ్రతం చెడ్డా పవన్ కు ఫలితం దక్కలేదా?

అసెంబ్లీ.. పార్లమెంట్.. మున్సిపల్.. పంచాయతీ.. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో ఉందా? లేదా అన్న సందేహాలు కలుగకమానదు. ఓవైపు టీఆర్ఎస్.. బీజేపీలు సీట్ల సంఖ్యలో దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ టీపీపీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీపీసీసీ బాధ్యతలు తీసుకోవడమంటే కత్తి మీద సామేనని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నిలదొక్కుకోవాలంటే మాత్రం అటూ టీఆర్ఎస్.. ఇటూ బీజేపీ ఒకేసారి గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే అభ్యర్థి కోసం వెతుకుతోంది. అయితే ఆపార్టీలోని సీనియర్లంతా టీపీసీసీ తమకే దక్కుతుందంటూ పోటీ పడుతుండటం గమనార్హం. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని టీపీసీసీగా చేయాలని భావిస్తుండగా నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను సైతం ఉన్నట్లు ప్రకటించాడు.

Also Read: రేపే డిసెంబర్‌‌ 7.. వరద సాయం మొదలవుతుందా?

ఆ తర్వాత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను సైతం టీపీసీసీ పదవీ ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా వీహెచ్ హన్మంతరావు టీపీసీసీకి తానే కరెక్ట్ అని చెబుతున్నాడు. ఎప్పటికీ అగ్రవర్ణాలకే టీపీసీసీ ఇస్తారా? బీసీలకు ఇవ్వరా? అంటూ బీసీ కార్డును తెరపైకి తీసుకొస్తున్నారు.

వీరితోపాటు శ్రీధర్ బాబు.. జీవన్ రెడ్డి.. మల్లు భట్టివిక్రమార్కలు సైతం టీపీసీని ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ ప్రకటించక ముందే ధిక్కారస్వరం విన్పిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రకటన వచ్చాక ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్