
గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ కాల్పులతో అట్టుడుకుతోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా భద్రతా దళాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఇటీవల ఉగ్రదవాదుల దాడిలో భారత జవాన్లు మరణించడంతో దీనికి ప్రతీకారంగా భారత సైతం తిప్పి కొడుతోంది. తాజాగా జమ్మూ శివరాలోని జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిలో గురువారం ఉగ్రవాదుల వాహనం వెళ్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని నగరోటా జిల్లా వద్ద అడ్డుకున్నారు. ఈ సమయంలో భారత్ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు మృతి చెందారు. కాగా ఓ భారత కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో జమ్మూ- కాశ్మీర్ రహదారిని అధికారులు మూసివేశారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భారత్ భద్రతా దళాలు గాలిస్తున్నారు.