పద్మవిభూషణ్ ను వెనక్కిచ్చిన మాజీ సీఎం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా పంజాబ్ నాయకులు తమ పదవులు, అవార్డులను వదులుకుంటున్నారు. తాజాగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ సీఎం, అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కేంద్రం తీరుపట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న పద్మ విభూషన్ అవార్డును వాపస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హర్యానా ఎమ్మెల్యే సొంబిర్ సంగ్వాన్ హర్యానా లైవ్ […]

Written By: Suresh, Updated On : December 3, 2020 2:03 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా పంజాబ్ నాయకులు తమ పదవులు, అవార్డులను వదులుకుంటున్నారు. తాజాగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ సీఎం, అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కేంద్రం తీరుపట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న పద్మ విభూషన్ అవార్డును వాపస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హర్యానా ఎమ్మెల్యే సొంబిర్ సంగ్వాన్ హర్యానా లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు అందించారు.