
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. 1930 జూలై 24న జన్మించిన ఆయన బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. గుజరాత్‌కు 1995 మార్చి నుంచి అక్టోబర్ వరకు మొదటి పర్యాయంగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 1998 మార్చి నుంచి 2001 అక్టోబర్‌వరకు సీఎంగా పనిచేశారు. గత నెల 30న సోమనాథ్ మందిర్ ట్రస్టుకు ఆయన రెండోవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల బీజేపీ నాయకులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.