https://oktelugu.com/

టీఆర్పీ కుంభకోణం కేసులో ‘బార్క్’ మాజీ సీఈవో అరెస్టు

రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభకోణం కేసులో పూణెకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని టీవీ చానల్స్ టీఆర్పీ రిగ్గింగ్ చేసిన వ్యక్తుల్లో ఆయన 15వ వ్యక్తి. పూణె జిల్లాలోని రాజ్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అతనిని క్రైం ఇంటలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. టీఆర్ఫీ కుంభకోణం కేసులో కొందరు ఫిర్యాదు […]

Written By: , Updated On : December 25, 2020 / 09:56 AM IST
Follow us on

రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభకోణం కేసులో పూణెకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని టీవీ చానల్స్ టీఆర్పీ రిగ్గింగ్ చేసిన వ్యక్తుల్లో ఆయన 15వ వ్యక్తి. పూణె జిల్లాలోని రాజ్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అతనిని క్రైం ఇంటలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. టీఆర్ఫీ కుంభకోణం కేసులో కొందరు ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్పీ రేటును వీక్షకులను భట్టి నిర్ణయిస్తారు. దీంతో యాడ్ రెవెన్యూ పెరుగుతుంది. కానీ కొన్ని ఛానెళ్ల రేటు పెంచడం కోసం కొందరు అధికారులు నివాస గ్రుహాల్లో డబ్బులు ఇస్తున్నట్లు ఆరోపణ వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.