టీపీసీసీ చీఫ్ ఎంపిక పూర్తి.. అతడికే ఛాన్స్

టీపీసీసీ ఛీప్ వేడి రగులుకుంటోంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు కొత్త ఇన్ చార్జిని నియమించేందుకు ఫైనల్ చేసినట్టు సమాచారం. టీపీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలాంటి వారి పేర్లు కూడా ఏఐసీసీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ కంటే […]

Written By: NARESH, Updated On : December 25, 2020 10:54 am
Follow us on

టీపీసీసీ ఛీప్ వేడి రగులుకుంటోంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు కొత్త ఇన్ చార్జిని నియమించేందుకు ఫైనల్ చేసినట్టు సమాచారం. టీపీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలాంటి వారి పేర్లు కూడా ఏఐసీసీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం.

తెలంగాణలో బీజేపీ కంటే తీసికట్టుగా మారి మూడో స్థానంలోకి పడిపోయిన కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని సమాచారం. జనవరి 1 2021 నుంచి కాంగ్రెస్ కొత్త యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగబోతోంది.

పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మాణిక్యం, బోసురాజు, శ్రీనివాసన్ లు రెండు సార్లు సమావేశమై ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థి ఎంపికను నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ను ఇతర రాజకీయ పక్షాలకు ధీటుగా నడిపించగల సామర్థ్యం ఉన్న వారినే నియమించాలని ఈ సమావేశంలో రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయాలపై అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే అనేకసార్లు భేటి అయ్యారు.ఇక అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలకు రాష్ట్ర స్థాయిలో లేదా ఏఐసీసీ స్థాయిలో మెరుగైన పదవులు ఇచ్చి అసంతృప్తి చల్లార్చాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ స్వయంగా ఆశావహులతో మాట్లాడుతారని చెబుతున్నారు.

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పదవికి నాయకుడిని ఏఐసీసీ దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసి కోమటిరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకుంటారని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రెండురోజుల్లో రాబోతున్నట్టు తెలిసింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.