https://oktelugu.com/

ఎమ్మెల్సీ ఇంట్లో కాల్పులు: ఒకరు మృతి

ఓ ఎమ్మెల్సీ  ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో హజ్రత్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అమిత్ యాదవ్ ఇంట్లో గత రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాకేశ్ అనే వ్యక్తి తన తుపాకీని వేరే వ్యక్తికి ఇవ్వగా అనుకోకుండా రాకేశ్ తలపైనే కాల్చాడు. తీవ్ర గాయాలైన రాకేశ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మ్రుతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 21, 2020 / 01:19 PM IST
    Follow us on

    ఓ ఎమ్మెల్సీ  ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో హజ్రత్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అమిత్ యాదవ్ ఇంట్లో గత రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాకేశ్ అనే వ్యక్తి తన తుపాకీని వేరే వ్యక్తికి ఇవ్వగా అనుకోకుండా రాకేశ్ తలపైనే కాల్చాడు. తీవ్ర గాయాలైన రాకేశ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మ్రుతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మద్యం మత్తులోనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ సంఘటన సమయంలో ఎమ్మెల్సీ ఇంట్లో ఉన్నాడా..? లేడా..? అనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.