https://oktelugu.com/

ఎన్టీఆర్ తరువాత కేసీఆరే..: పోసాని కృష్ణమురళి

మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్లో ఉన్న వ్యక్తిగా.. ఎన్టీఆర్ తరువాత కేసీఆర్ మాత్రమేనని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు.    తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అందరినీ సమానంగా చూశారన్నారు. మత సామరస్యం లేకుండా ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు.తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలు చూశానని, అయితే కేసీఆర్ లాంటి పట్టుదల వ్యక్తిని చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై […]

Written By: , Updated On : November 21, 2020 / 01:09 PM IST
Follow us on

మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్లో ఉన్న వ్యక్తిగా.. ఎన్టీఆర్ తరువాత కేసీఆర్ మాత్రమేనని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు.    తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అందరినీ సమానంగా చూశారన్నారు. మత సామరస్యం లేకుండా ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు.తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలు చూశానని, అయితే కేసీఆర్ లాంటి పట్టుదల వ్యక్తిని చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై దాడులు జరగలేదన్నారు. తెలంగాణ బిడ్డల మాదిరిగానే ఏపీ వారిని కేసీఆర్ క్షేమంగా చూస్తున్నారని పోసాని తెలిపారు.హైదరాబాద్ లో వందేళ్ల తరువాత పెద్ద వరదలు వచ్చాయని, అందుకే ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ఆంధ్రప్రజలపై కేసీఆర్ కు ఏమాత్రం కోపం లేదని, కేవలం దోచుకున్నవారిపైనే కోపం ఉందన్నారు.