
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా గురువారం కేంద్రంతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యాయి. అయితే మధ్యాహ్నం వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో తమ నిరసనను కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందించిన ఆహారాన్ని తీసుకోకుండా తమ వెంట తెచ్చుకున్న భోజనాన్ని భుజించారు. సమావేశం జరుగుతున్న విజ్ఞాన్ భవన్ లోపలి విజువల్స్ ప్రకారం ఓ టేబుల్ పై తమ భోజనాన్ని తింటుండగా మరి కొందరు కింద కూర్చుని తమ ఆహారాన్ని తీసుకున్నారు. వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ నిరసన కొనసాగిస్తామన్నారు.