రైతు ఉద్యమం: మోడీకి మేధావుల సెగ

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు వెల్లువెత్తుతోంది. దేశంలోని ప్రతిపక్షాలు ఇప్పటికే వారికి మద్దతు పలకగా.. తాజాగా మేధావులు సైతం ఈ రైతుల ఉద్యమానికి మద్దతుపలకడం విశేషం. మేధావులు, సామాజికవేత్తలు ఇప్పుడు రైతు ఉద్యమానికి సపోర్టు చేస్తూ కేంద్రం తెచ్చిన ‘కొత్త వ్యవసాయ చట్టాలను’ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: తలైవా న్యూ ఇయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న రజనీ..! మేధావులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక అవార్డులను […]

Written By: NARESH, Updated On : December 3, 2020 8:33 pm
Follow us on

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు వెల్లువెత్తుతోంది. దేశంలోని ప్రతిపక్షాలు ఇప్పటికే వారికి మద్దతు పలకగా.. తాజాగా మేధావులు సైతం ఈ రైతుల ఉద్యమానికి మద్దతుపలకడం విశేషం. మేధావులు, సామాజికవేత్తలు ఇప్పుడు రైతు ఉద్యమానికి సపోర్టు చేస్తూ కేంద్రం తెచ్చిన ‘కొత్త వ్యవసాయ చట్టాలను’ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తలైవా న్యూ ఇయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న రజనీ..!

మేధావులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కి ఇస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. రైతులకు మద్దతు ప్రకటిస్తూ తాజాగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి ఆకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ (92) ఏకంగా తనకు ప్రధానం చేసిన ‘పద్మ విభూషన్’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. అన్నదాతలకు మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇదిప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

Also Read: ఫేక్ కాదు.. షేక్.. సీఎం జగన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..!

గతంలోనూ మాజీ సైనికుల పోరాటానికి మద్దతనిస్తూ ‘అవార్డులను దేశవ్యాప్తంగా ’ మేధావులు, అవార్డీలు వెనక్కి ఇచ్చారు. తాజాగా మరోసారి ప్రకాష్ సింగ్ బాదల్ ఈ ఒరవడికి శ్రీకారం చుట్టారు.

కాగా ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ లు రెండో రోజు కూడా రైతులతో చర్చలు జరిపారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్