Homeఎంటర్టైన్మెంట్పవన్, మహేష్ కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే !

పవన్, మహేష్ కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే !

Mahesh Babu Pawan Kalyan
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటి ఆ రూమర్ అంటే.. ‘పవన్, మహేష్ బాబు కలిసి ఈ చిత్రంలో నటించబోతున్నారట. దీనికి తోడు సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు క్యారెక్టర్ కూడా ఎంతో స్పెషల్‌గా క్రియేట్ చేశాడట పరశురాం. అలాగే ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రను పవన్ కల్యాణ్‌ చేయబోతున్నాడని.. 5 నిమిషాలే ఉండే ఈ రోల్ కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.

Also Read: “సలార్” దెబ్బకు ప్రభాస్ సినిమాల రాక మారింది !

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, నిజంగా వీరిద్దరూ కలిసి నటిస్తే మాత్రం.. బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం. ఇక కథ ప్రకారం సినిమాలోని కొంత భాగం తప్పనిసరిగా అమెరికాలోనే షూట్ చేయాలట. పైగా అమెరికా షెడ్యూల్ కోసమే మహేష్ కొత్త లుక్ లోకి మారాడట. అందుకే ఈ నెల 20 నుండి అమెరికా షెడ్యూల్ ను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఒకవేళ అమెరికా షెడ్యూల్ ఇప్పుడు పెట్టకపోతేక మహేష్ ఎంతో కష్టపడి మార్చుకున్న లుక్ వృధాగా పోతుంది. దానికి తోడు మళ్లీ తన లుక్ ను మార్చుకోవాలి. అందుకే కష్టం అయినా.. ఇప్పుడే అమెరికా షెడ్యూల్ ను ఫిక్స్ చేస్తున్నారు.

Also Read: చివరిదశలో అందాలు ఒలకబోస్తోన్న శృతి హాసన్ !

కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మహానటి తరువాత కీర్తికి దక్కిన బెస్ట్ మూవీ ఇదే. ఇక ‘సర్కారు వారి పాట’లో విలన్ గా మొదట కన్నడ హీరో ఉపేంద్రను అనుకున్నారు.. ఆయన కోసం ప్రయత్నాలు చేశారు. ఉపేంద్ర అయితే బాగుంటుందని మహేష్ కూడా ఫీల్ అయ్యాడు. అందుకే ఎంత రెమ్యునరేషన్ ఆయినా ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ స్టార్ హీరోగా కొనసాగుతున్న నేను, విలన్ గా చేయడం ఏమిటి.. సారీ అంటూ ఉపేంద్ర మొత్తానికి మహేష్ సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. దాంతో తమిళ్ మాజీ హీరో అరవింద స్వామిని విలన్ పాత్రలో తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version