ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఉదయం 7.21 గంటలకు దావావోలో రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. మిందనావో కేంద్రంగా 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.ఈ భూకంపంతో ఫిలిప్పీన్ ప్రజలు తీవ్ర భయాందోళ చెందారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. కాగా గత అగస్టులో ఫిలిప్పీన్స్ లో వచ్చిన భూకంపంతో తీవ్ర నష్టం జరిగింది. అప్పుడు ఒకరు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.