https://oktelugu.com/

ఆస్తి కోసం అఘాయిత్యం: భార్యతో కలిసి అత్తమామల హత్య

ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేసిన అత్తారింటికి పంపిన సొంత కూతురే భర్తతో కలిసి తల్లిదండ్రులను హత్య చేసింది. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బండి పాలెంకు చెందిన ముత్తయ్య, సుగుణమ్మలకు మనీషా అనే కూతురు ఉన్నారు. ఈమెును నెమలిబాబు అనే వ్యక్తితో వివాహం చేశారు. నెమలిబాబు వలంటీర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెమలి బాబు ఆస్తి కోసం మనీషాను వేధించసాగాడు. దీంతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 16, 2020 / 08:42 AM IST
    Follow us on

    ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేసిన అత్తారింటికి పంపిన సొంత కూతురే భర్తతో కలిసి తల్లిదండ్రులను హత్య చేసింది. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బండి పాలెంకు చెందిన ముత్తయ్య, సుగుణమ్మలకు మనీషా అనే కూతురు ఉన్నారు. ఈమెును నెమలిబాబు అనే వ్యక్తితో వివాహం చేశారు. నెమలిబాబు వలంటీర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెమలి బాబు ఆస్తి కోసం మనీషాను వేధించసాగాడు. దీంతో అస్తికోసం మనీషా సహకారంతో నెమలి బాబు నాలుగు రోజుల కిందటే అత్తమామల హత్యకు ప్లాన్ వేశారు. మంగళవారం అర్ధరాత్రి మనీషా, బాబురావులు కలసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం బయటపడిందని వారు పేర్కోన్నారు. ప్రస్తుతం నెమలిబాబు, మనీషాలు పోలీసుల అదుపులో ఉన్నారు.