అమెరిక్లనకు నేనే ప్రెసిడెంట్ అంటున్న బైడెన్..!

2020 నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరుపున బైడెన్ పోటీ చేశారు. అధక్ష ఎన్నికల్లో బైడెన్‌కు 306ఎల‌క్టోర‌ల్ ఓట్లు పోల‌వ్వ‌గా.. ట్రంప్‌కు కేవలం 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. Also Read: ఇద్దరు సీఎంల ఢిల్లీ పర్యటన.. తెరవెనుక రాజకీయం ఇదేనా? బైడెన్ కు అమెరికా అధ్యక్ష పదవీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. అయితే ఈ […]

Written By: Neelambaram, Updated On : December 16, 2020 10:43 am
Follow us on


2020 నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరుపున బైడెన్ పోటీ చేశారు. అధక్ష ఎన్నికల్లో బైడెన్‌కు 306ఎల‌క్టోర‌ల్ ఓట్లు పోల‌వ్వ‌గా.. ట్రంప్‌కు కేవలం 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

Also Read: ఇద్దరు సీఎంల ఢిల్లీ పర్యటన.. తెరవెనుక రాజకీయం ఇదేనా?

బైడెన్ కు అమెరికా అధ్యక్ష పదవీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలపై ట్రంప్ కోర్టుకు వెళ్లడంతో మళ్లీ కొన్నిచోట్ల రీ కౌంటింగ్ నిర్వహించారు. అయితే రెండోసారి కూడా బైడెన్ కే మెజార్టీ దక్కింది. అయినా ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోవడంతో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆలస్యమైంది.

అయితే ఇటీవల ట్రంప్ తన అమెరికా రాజ్యాంగంపై గౌరవం ఉందని.. అయితే తన పోరాటం మాత్రం కొనసాగుతుందని తెలిపి అధ్యక్ష పదవీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడి ఎంపికకు మార్గం సుగమం అయింది. అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ గెలుపును సోమ‌వారం ఎల‌క్టోర‌ల్ కాలేజీ అధికారికంగా ప్ర‌క‌టించింది.

Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

ఈ నేప‌థ్యంలో బైడెన్ తాజాగా అమెరికా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా నిర్ణయాన్ని ట్రంప్.. ఆయన సలహాదారులు అంగీకరించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని ట్రంప్ ప్రయత్నించాడని ఆయన ఆరోపించాడు.

ఇంతకు ముందు ఎన్నడూ అమెరికాలో ఇటువంటి పరిస్థితిని తాను చూడలేదని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు నేడు దేశంలోని ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని తెలిపారు. తానే అమెరికన్లందరికీ ప్రెసిడెంట్‌ని అంటూ స్పష్టం చేశాడు. ఈక్రమంలోనే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రష్యాతోపాటు పలు దేశాల అధినేతలకు బైడెన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు