గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదైందని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కచ్లోని ఖావ్డా గ్రామానికి తూర్పు ఆగ్నేయంలోని 26 కిలోమీటర్ల దూరంలో 4.3 తీవ్రతతో భూకంపం నమోదైందని గాంధీనగర్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా భూకవంపం ఉత్తర కచ్ యొక్క ఎడారి ప్రాంతాన్ని తాకిందని, అందువల్ల ఎటువంటి నష్టం జరగలేదని కచ్ వెస్ట్ డివిజన్ పోలీస్ కంట్రోల్ రూం పేర్కొంది. కాగా భూకంపానికి ముందు బుధవారం ఉదయం 2.29 గంటలకు కచాలోని భచావు పట్టనానికి సమీపంలో 2.2 తీవ్రతతో మొదలైందని సిస్మోలజీ తెలిపింది.