
ప్రతిష్టాత్మక ఐఐటీల్లో అధ్యాపక నియామకాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరం లేదని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఐఐటీల్లో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఆవశ్యకతపై రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సీఈఐ (సెంట్రల్ ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూషన్స్) చట్టం 2019 ప్రకారం.. 23 ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో కుల ఆధారిత రిజన్వేషన్లు అవసరం లేదని కమిటీ కేంద్రానికి నివేదించింది. అయితే ఈ స్థానంలో ప్రత్యేకమైన కోటాను కమిటీ ప్రతిపాదించింది. వైవిధ్యమైన సమస్యలను ప్రత్యేకమై ప్రచారం, నియామకాల ద్వారా పరిష్కరించాలని కమిటీ సూచించింది.