https://oktelugu.com/

వారికీ 19, 20 ఏళ్ల వయసు భామలే కావాలి !

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ‘దియా మీర్జా’కి ఓ అలవాటు ఉంది. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడడు. తానూ మాట్లాడాలనుకున్నది మాట్లాడుతూ ఉంటుంది. కాగా, తాజాగా ‘దియా మీర్జా’ మరోసారి ఉన్నది ఉన్నట్లు మాట్లాడి మొత్తానికి సీనియర్ హీరోలకు షాక్ ఇచ్చింది. నిజానికి, ఈ భామది మన హైదరాబాదే. ఇక్కడి భామ అయినా, ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కెరీర్ కొనసాగిస్తూ ఉంది. అయితే, తాజాగా నాగార్జున నటిస్తున్న “వైల్డ్ డాగ్” అనే సినిమాతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 05:05 PM IST
    Follow us on


    బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ‘దియా మీర్జా’కి ఓ అలవాటు ఉంది. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడడు. తానూ మాట్లాడాలనుకున్నది మాట్లాడుతూ ఉంటుంది. కాగా, తాజాగా ‘దియా మీర్జా’ మరోసారి ఉన్నది ఉన్నట్లు మాట్లాడి మొత్తానికి సీనియర్ హీరోలకు షాక్ ఇచ్చింది. నిజానికి, ఈ భామది మన హైదరాబాదే. ఇక్కడి భామ అయినా, ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కెరీర్ కొనసాగిస్తూ ఉంది. అయితే, తాజాగా నాగార్జున నటిస్తున్న “వైల్డ్ డాగ్” అనే సినిమాతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది ఈ సీనియర్ బ్యూటీ.

    Also Read: పెళ్లి పై కస్సుబుస్సులాడుతోన్న ‘ముదురు భామ’ !

    ప్రస్తుతం దియా వయసు 39 ఏళ్ళు. కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోల వైఖరి ఎలా ఉంటుందో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి.. తానేంటో మళ్ళీ నిరూపించుకుంది. ఇంతకీ దియా మాట్లాడిన మాటలు ఏమిటంటే.. “ఇప్పుడు బాలీవుడ్ ని ఏలుతున్న హీరోలంతా 50 ఏళ్ళు దాటిన వారే. అయినా, వారికీ 19, 20 ఏళ్ల వయసు భామలే కావాలి. వాళ్ళకే హీరోయిన్స్ గా ఛాన్స్ లు ఇస్తారు. వాళ్ళ కూతుళ్ళ వయసున్న భామలతో రొమాన్స్ చేయడానికి మన హీరోలకు భలే ఇంట్రస్ట్. యువ హీరోయిన్ లతో నటిస్తూ తామూ కూడా యుంగే అని బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు సీనియర్ హీరోలు.

    Also Read: మహేష్ బాబు ఫోటోలు చూసి ఆశ్చర్య పోతుంటా !

    అలాగే హీరోయిన్స్ కు 35, 40 ఏళ్ల వయసు వస్తే చాలు.. ఇక ఆ నటీమణులకు అస్సలు ఎలాంటి పాత్రలు ఇవ్వరు. చివరకు సిస్టర్ గా కూడా నటించడానికి ఒప్పుకోరు’ అంటూ సీనియర్ హీరోల పై దియా సంచలన కామెంట్స్ చేసింది. అయితే, దియా కేవలం బాలీవుడ్ గురించే మాట్లాడింది. కాకపోతే.. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అనీ వుడ్ ల పరిస్థితి ఇదే. దాంతో 60 ఏళ్ల హీరోల అందరికీ దియా మాటలు కొంచెం ఇబ్బంది కలిగించేవే. అయినా, 20 ఏళ్ల భామలతో డ్యూయెట్లు పాడే మన సీనియర్ హీరోలు.. సీనియర్ హీరోయిన్లను కూడా పట్టించుకుంటే బాగుంటుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్