నిద్రమాత్రలు మింగి ఓ మహిళా ఎమ్మల్యే ఆత్మహత్యకు యత్నించింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా అంకుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే అరుణా పూంగోదై ఆత్మహత్యకు యత్నించగా ఆమె సహచరులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిద్రమాత్రలు అధికంగా మింగినందును పరిస్థతిని ఇప్పుడే చెప్పలేమని వైద్యులు తెలిపారు. కాగా ఎమ్మల్యే ఆత్మహత్యాయత్నానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇటీవల కడయంలో జరిగిన ఓ సభలో డీఎంకే తెన్ కాశి జిల్లా కార్యదర్శి శివపద్మనాభన్, ఎమ్మల్యే అరుణా పూంగోదై మధ్య గోడవలు జరిగాయి. అయితే తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా ఇంకేమైనా కారణాల అనేది విచారణలో తేలుతుందని అలకుళం పోలీస్ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖఱ్ తెలిపారు. అరుణా పూంగోదై ఎంపీ కనిమొళి వర్గానికి చెందివారు కాగా.. శివ పద్మనాభన్ స్టాలిన్ కు మద్దతుదారుడు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య వైరుద్యాలు రావచ్చని పలువరు చర్చించుకుంటున్నారు.