Homeఎంటర్టైన్మెంట్పాయల్ కి ఈ సినిమా కూడా మైనసే !

పాయల్ కి ఈ సినిమా కూడా మైనసే !

Payal Rajput Village Girl
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కచ్చితంగా పాయల్ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఆ సినిమాలో పాయల్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉంది. పాయల్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. పైగా మాస్ జనాన్ని పాయల్ బాగా ఆకట్టుకుంది. లిప్ లాక్స్.. హాట్ సీన్స్ లో ఎలాంటి హద్దు అదుపు లేకుండా అదరగొట్టేసింది. దాంతో ఇక పాయల్ కి తెలుగు ఇండస్ట్రీలో తిరుగుండదని.. స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని అందరు భావించారు. అందుకు తగ్గట్లుగానే ఆర్ ఎక్స్ 100 తర్వాత దాదాపు అర డజను సినిమా అవకాశాలు పాయల్ ను వరించాయి. కానీ సక్సెసే పాయల్ కి దూరమైపోయింది.

Also Read: ఈ బ్యూటీ కెరీర్ ఎప్పుడు సెట్ అవుతుందో ?

దీనికితోడు అన్నీ కథలలో ఆర్ ఎక్స్ 100 సినిమా తరహా లోనే లిప్ కిస్ లు.. అందాల ప్రదర్శన చేయాలని అడగడంతో పాయల్ ఆ సినిమాలను రిజెక్ట్ చేసింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడం, ఇక వచ్చిన ఆ ఒకటి రెండు సినిమాల్లో ఎలాగైనా కమర్షియల్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోవాలనుకోవాలని అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ గా నటించడం ఒక ఆనవాయితీగా పెట్టుకుంది. ఆర్ డి ఎక్స్ లవ్ అన్న సినిమా అలా చేసిందే. అది అంతగా జనాలని ఆకట్టుకోకపోవడం పాయల్ కి మైనస్ అయింది. దాంతో పాయల్ ఆశించిన అవకాశాలు దక్కడం లేదు. మధ్యలో విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య ల మల్టీస్టారర్ వెంకీమామ, మాస్ మహా రాజా రవితేజ డిస్కో రాజా సినిమాలు చేసినా పాయల్ కి ఒరిగిందేమీ లేదు.

Also Read: లక్ అంటే ఈ హీరోయిన్ దే !

ఇప్పుడు తాజాగా పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఓ అతిథి’. ఈ సినిమాలో పాయల్ ‘మల్లిక’ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమాని నిన్న ప్రివ్యూ వేశారు. సినిమాలో మ్యాటర్ లేదు. పీరియాడికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో ఈ రోజు విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా పై బ్యాడ్ టాక్ బాగా వినిపిస్తోంది. పాపం ధైర్యం చేసి ఈ సినిమా చేసిన పాయల్ ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఇప్పుడు పాయల్ కి ఈ సినిమా బాగా మైనస్ అయ్యేలా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version