https://oktelugu.com/

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ హిట్టా.. ఫ్లాపా?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. ఆనంద్ దేవరకొండ తొలిచిత్రం ‘దొరసాని’. తొలిమూవీతోనే తనలో ఓ నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. అతడి రెండో చిత్రంగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..! Also Read: పాయల్ కి ఈ సినిమా కూడా మైనసే ! మిడల్ క్లాస్ మెలోడీస్ మూవీని ఫ్యామిలీ కామెడీ డ్రామాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 10:52 AM IST
    Follow us on

    విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. ఆనంద్ దేవరకొండ తొలిచిత్రం ‘దొరసాని’. తొలిమూవీతోనే తనలో ఓ నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. అతడి రెండో చిత్రంగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!

    Also Read: పాయల్ కి ఈ సినిమా కూడా మైనసే !

    మిడల్ క్లాస్ మెలోడీస్ మూవీని ఫ్యామిలీ కామెడీ డ్రామాగా దర్శకుడు వినోద్‌ అనంతోజు తెరకెక్కించాడు. ఆనంద్ దేవరకొండ.. వర్షా బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే రాఘవ(ఆనంద్ దేవరకొండ) ఫ్యామిలీ ఊరిలో ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటుంది. రాఘవకు చిన్నప్పటి నుంచే గుంటూరులో హోటల్ పెట్టి.. దాన్ని సక్సెస్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. రాఘవ చేసే బొంబాయి చట్నీ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాడు.

    రాఘవకు స్కూల్ డేస్ నుంచి అతని మరదలు సంధ్య(వర్షా బొల్లమ్మ) లవ్ నడుస్తూ ఉంటుంది. వీళ్ల లవ్ సక్సెస్ అవ్వాలంటే రాఘవ గుంటూరులో పెట్టి సక్సస్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. రాఘవ తన హోటల్ ను ఎలా సక్సస్ చేశాడు.. ఆనంద్-వర్ష లవ్ స్టోరీలో చివరకు ఏమైందనేది సినిమాగా దర్శకుడు రూపొందించాడు.

    హీరోహీరోయిన్లతోపాటు రాఘవ తండ్రి పాత్రలో నటుడు గోపిరాజుతోపాటు పలు క్యారెక్టర్లు కామోడీని పండించాయి. అయితే సినిమా ఫస్ట్ చాలా స్లోగా నడిచింది. కొన్ని కామెడీ సీన్స్ ఇంతకముందే చూసినట్లు కన్పిస్తాయి. హీరోయిన్ కు ఆమె తండ్రి మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు సింపుల్ గా చెప్పేశాడు.

    Also Read: ఈ బ్యూటీ కెరీర్ ఎప్పుడు సెట్ అవుతుందో ?

    కామెడీ సీన్లు.. ఆగస్తీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమాట్రోగఫ్రీ బాగుంది. కెమెరామెన్ పనితనం.. ఎడిటింగ్ ఆకట్టుకుంది. నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా ను నిర్మించినట్లు కన్పిస్తోంది. మొత్తానికి మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించే కంటెంట్ తో వచ్చినట్లే కన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్