US President Joe Biden: జో బైడెన్ ఫెయిలయ్యాడా? నాయకత్వ వైఫల్యమేనా?

US President Joe Biden: అఫ్గానిస్తాన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాలిబన్ల ఆగడాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఫ్గాన్ లో దాదాపు 20 ఏళ్ల పాటు సైనిక కార్యకలాపాలు నిర్వహించి రూ. లక్ష కోట్ల డాలర్లు వెచ్చించినా చివరకు తాలిబన్లకు అణచలేక అమెరికాయే అక్కడ నుంచి వైదొలగాల్సి వచ్చింది. నిజానికి ఈ ఒప్పందం డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే కుదిరినా బాధ్యత మాత్రం బైడెన్ మీద పడడంతో ఆయన అభాసుపాలయ్యారు. అమెరికా గౌరవానికి భంగం […]

Written By: Srinivas, Updated On : August 29, 2021 6:29 pm
Follow us on

US President Joe Biden: అఫ్గానిస్తాన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాలిబన్ల ఆగడాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఫ్గాన్ లో దాదాపు 20 ఏళ్ల పాటు సైనిక కార్యకలాపాలు నిర్వహించి రూ. లక్ష కోట్ల డాలర్లు వెచ్చించినా చివరకు తాలిబన్లకు అణచలేక అమెరికాయే అక్కడ నుంచి వైదొలగాల్సి వచ్చింది. నిజానికి ఈ ఒప్పందం డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే కుదిరినా బాధ్యత మాత్రం బైడెన్ మీద పడడంతో ఆయన అభాసుపాలయ్యారు. అమెరికా గౌరవానికి భంగం కలగకుండా చేయడంలో బైడెన్ విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల కాబుల్ విమానాశ్రయం వద్ద జరిగిన బాంబుల దాడిలో ప్రాణనష్టం జరగడంతో అందరిలో ఆగ్రహం పెల్లుబికింది. అమెరికా చర్యతోనే ఇలా దారుణాలు జరుగుతున్నాయని విమర్శలు పెరిగాయి. కాబుల్ నుంచి సైనికులను, అఫ్గాన్ ప్రజలను హడావిడిగా తరలించే క్రమంలోనే ఉగ్రవాద దాడి జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా అసమర్థతతోనే దాడులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బైడెన్ పై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు కరోనా డెల్టా వేరియంట్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. దీని బారిన ప్రజలు పడుతూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. బైడెన్ ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధానికి చర్యలు చేపట్టడంలో విఫలం అయిందని చెబుతున్నారు. టెన్నెసీ రాష్ర్టంలో భారీ వరదలు, పశ్చిమ భాగంలో కార్చిచ్చులు, అనావృష్టి, పెను తుపాన్ల దాడికి అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో జో బైడెన్ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఆయన సరైన విధంగా స్పందించడం లేదని చెబుతున్నారు.

బైడెన్ అమెరికా ప్రభుత్వంలో 40 ఏళ్లపాటు పనిచేసినా ఆయన పనితనంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆయన తీరుపై విమర్శలే వస్తున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తొలి ఆరు నెలల్లో ఆయన పనితనంలో మంచి పురోగతి సాధించినా తరువాత మందగించింది. ఇంకా అఫ్గాన్ వ్యవహారంలో తాలిబన్లతో లోపభూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకుందని ట్రంపు చేసిన విమర్శలను బైడెన్ భరించాల్సి వస్తోంది.

అంతర్జాతీయంగా జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారుతున్నారు. అఫ్గానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాల్లో అమెరికా పాత్ర ఉందని నమ్ముతున్న క్రమంలో బైడెన్ పాత్ర పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో తాలిబన్ల ఆగడాలతో ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాల మేరకే అఫ్గాన్ పరిణామాలు చోటుచేసుకున్నాయని నమ్ముతున్నారు.