Motkupally Narsimha: దళితబంధు పథకంపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తుంటే రేవంత్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. దళితబంధు పథకాన్ని రాష్ర్టమంతటా విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను ఇంప్రెస్ చేసుకునేందుకు నర్సింహులు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దళితబంధు పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలకు నిరసనగా మోత్కుపల్లి ఇంట్లోనే దీక్ష ప్రారంభించారు. దళితబంధు అమలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు నివ్వెరపోతున్నారు. మోత్కుపల్లి టీడీపీలో ఉండగా ఆయన తిట్టని వారు లేరు. అందరిని తన ఇస్టమొచ్చినట్లు తిట్టిపోశారు. అందులో కేసీఆర్ సైతం ఉన్నారు. దీంతో అప్పటి వీడియోలు ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి. అప్పుడు నికృష్ణుడు అయిన వాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అయ్యారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ఉఫాధి కోసమే మోత్కుపల్లి కేసీఆర్ పై ప్రేమ ఒలకబోస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేస్తున్న వారిని తిడుతున్నారు. దళితబంధు పథకం చైర్మన్ గా తనను నియమిస్తారనే ఉద్దేశంతోనే మోత్కుపల్లి ఈ విధంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతూ ఆయనపై ఈగ వాలకుండా చేస్తున్నారని సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత కేసీఆర్ ఎవరిని కూడా దగ్గరకు తీయరని తెలిసినా నేతల్లో ఎందుకో అంత ప్రేమ అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
మోత్కుపల్లి నర్సింహులు టీడీపీలో ఉండగా తనదైన వాగ్దాటితో అందరిని బెదరగొట్టేవారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ప్రస్తానం ముగిసిపోవడంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో తమకు అనువైన పదవుల్లో సాగుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. కానీ మోత్కుపల్లి నర్సింహులు ఓ విచిత్రమైన నేత. ఆయన నోటి నుంచి ఎక్కువగా తిట్లే వచ్చేవి. దీంతో ఇప్పుడు మోత్కుపల్లికి ఆశించిన పదవి దక్కి ఆయనకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తారో లేదో అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.