
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట డెత్ వారెంట్లని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ తప్పిదాల్ని ప్రశ్నించేవారిపై కేసులు పెడతారని, అవసరమైతే వారిని దేశద్రోహులుగా చిత్రించడానికి ఏమాత్రం వెనకడుగు వేయరని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యం(పాలన)లో అన్యాయాలు, దారుణాలకు పరిమితి లేకుండా పోతోందని, దీనిపై పెద్ద పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ అన్నారు.