https://oktelugu.com/

బ్రేకింగ్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వినియోగానికి డీసీజీఐ అనుమతి

భారత్ లో ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. తొలి రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని డీసీజీఐ డైరెక్టర్ తెలిపారు. రెండు డోసులుగా వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేయాలని సూచించారు. డీసీజీఐ అనుమతితో వారంలోగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ను ‘కోవిషీల్డ్ ’ పేరుతో దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, కోవాగ్జిన్ ను […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 3, 2021 / 11:32 AM IST
    Follow us on

    భారత్ లో ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. తొలి రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని డీసీజీఐ డైరెక్టర్ తెలిపారు. రెండు డోసులుగా వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేయాలని సూచించారు. డీసీజీఐ అనుమతితో వారంలోగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ను ‘కోవిషీల్డ్ ’ పేరుతో దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, కోవాగ్జిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివ్రుద్ధి చేసింది. ఇదిలా ఉండగా అమెరికా దిగ్గజం ఫైజర్ కంపెనీ దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే అహ్మదాబాద్ కు చెందిన జైడస్ డ్యాడిల్లా వ్యాక్సిన్ మూడో విడత ట్రయల్ కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.