https://oktelugu.com/

భారీ వర్షంలోనూ కొనసాగిన రైతు నిరసనలు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు భారీ వర్షంలోనూ నిరసనను కొనసాగించారు. శనివారం రాత్రి నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు చలితో తీవ్ర అవస్థలకు గురైన రైతులు వర్షానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానిక రైతులు పేర్కొన్నారు. ‘నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చేస్తున్న రైతుల వేదికలు నిండిపోయాయని, వారి గూడారాల్లోకి వర్షపు నీరు చేరింది’ అని రైతు నాయకుడు అభిమన్యు కోహార్ ఆదివారం తెలిపారు. వర్షం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 3, 2021 / 11:23 AM IST
    Follow us on

    కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు భారీ వర్షంలోనూ నిరసనను కొనసాగించారు. శనివారం రాత్రి నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు చలితో తీవ్ర అవస్థలకు గురైన రైతులు వర్షానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానిక రైతులు పేర్కొన్నారు. ‘నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చేస్తున్న రైతుల వేదికలు నిండిపోయాయని, వారి గూడారాల్లోకి వర్షపు నీరు చేరింది’ అని రైతు నాయకుడు అభిమన్యు కోహార్ ఆదివారం తెలిపారు. వర్షం కారణంగా నిరపన ప్రదేశాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, వర్షానికి తోడు చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఆయన తెలిపారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం కనువిప్పు కలగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.