https://oktelugu.com/

కరోనా వాక్సి‘నేషన్’.. ఐదు దశల్లో..!

కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అన్ని కసరత్తులు చేస్తోంది. జనవరి 2న అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం త్వరలోనే వ్యాక్సిన్ ఫంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. Also Read: కార్పొరేటర్లపై అనర్హత.. ఎన్నికల కమిషన్ వార్నింగ్..! అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలోని 130కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలంటే చిన్న విషయం కాదు. దీంతో కేంద్రం తొలి విడుతగా 30కోట్ల మందికి వ్యాక్సిన్ ను పంపిణీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 3, 2021 / 11:40 AM IST
    Follow us on


    కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అన్ని కసరత్తులు చేస్తోంది. జనవరి 2న అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం త్వరలోనే వ్యాక్సిన్ ఫంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.

    Also Read: కార్పొరేటర్లపై అనర్హత.. ఎన్నికల కమిషన్ వార్నింగ్..!

    అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలోని 130కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలంటే చిన్న విషయం కాదు. దీంతో కేంద్రం తొలి విడుతగా 30కోట్ల మందికి వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది.

    30కోట్ల మంది ప్రజలకు రాబోయే ఆరేడు నెలల్లో వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాక్సిన్ కు డీజీసీఏ అనుమతి ఇచ్చిన వెంటనే వ్యాక్సిన్ పంపిణీ షూరు కానుంది.

    కరోనా వ్యాక్సిన్ పంపిణీని కేంద్రం ఐదు దశల్లో నిర్వహించనుందని. తొలుత ప్రభుత్వ.. ప్రైవేట్ ఆరోగ్య కార్యకర్తలు.. హెల్త్ కేర్.. పారామెడికల్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

    Also Read: క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా ఉందా.. పెంచుకోవడం ఎలా అంటే..?

    రెండో దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది.. భద్రతా దళాలు..మున్సిపల్.. రెవిన్యూ తదితర సిబ్బందికి.. మూడో దశలో 60ఏళ్లు పైబడిన.. 50నుంచి 60ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండు క్యాటరీలుగా విభజించి అందించనున్నారు.

    నాలుగో దశలో కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను భౌగోళికంగా గుర్తించి అక్కడివారికి టీకాలు వేయనున్నారు. ఇక ఐదో దశలో మిగిలిన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఐదు దశల్లో 30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ లక్ష్యంగా కేంద్రం ముందుకు కదులుతోంది. ఆరేడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత కరోనా ప్రభావం.. వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండటాన్ని బట్టి మిగతా వారికి దశల వారీగా కేంద్రం పంపిణీ చేయనుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్