
తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలి గాలులతో వణికిపోతున్నారు. ఉమ్మడి అదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కుమ్రం భీం, గిన్నెధరిలో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటికే చలితో వణికిపోతున్న కొన్ని ప్రాంతాలపై మున్ముందు ఈ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.