క్రిస్మస్ వేడుకలతో అమెరికా అంతా పండుగ వాతావరణం నెలకొన్న వేళ అనుకోని ఉపద్రవం చోటుచేసుకుంది. భారీ పేలుడు అమెరికాను షేక్ చేసింది. క్రిస్మస్ పండుగ రోజే ఈ తీవ్ర ఘటన చోటుచేసుకోవడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Also Read: భారతదేశంలో డ్రైవర్ లేని ట్రైన్.. ఎక్కడ రాబోతుందంటే..?
టెన్నెసీ రాష్ట్రం నాష్ విల్లే నగరంలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయని పోలీసులు తెలిపారు.
కాగా పేలుడు ఉదయం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి కొన్ని మానవ శరీరాల అవశేషాలు అక్కడ పడ్డాయని ఖచ్చితంగా కొందరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఎవరన్నది గుర్తించలేకపోతున్నారు.
Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?
పేలుడుకు కారణమైన దుండగుడివే ఆ శరీర భాగాలు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదా ఆ ప్రాంతంలో ఎవరైనా అయ్యి ఉండాలని అనుకుంటున్నారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
బాంబు పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు గుర్తు తెలియని దుండగులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలోనే రిక్రియేషన్ వ్యాన్ నుంచి బాంబు పేలుడు సంభవించినట్టు సమాచారం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్