https://oktelugu.com/

హానిట్రాప్ లో చిక్కిన ఛోక్సీ.. అసలు కథ ఇదే

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఆయనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఛోక్సీ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ తో విందు కోసం వెళ్లి పోలీసులకు చిక్కాడని అంటిగ్వా ప్రధాని చెప్పారు. ఛోక్సీ వెంట అమ్మాయి ఉన్న మాట వాస్తవమే. ఆమె ఆయన స్నేహితురాలు కాదట. కిడ్నాప్ కేసులో ఆమె పాత్ర కూడా ఉంది. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపినట్లు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 5:50 pm
    Follow us on

    పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఆయనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఛోక్సీ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ తో విందు కోసం వెళ్లి పోలీసులకు చిక్కాడని అంటిగ్వా ప్రధాని చెప్పారు. ఛోక్సీ వెంట అమ్మాయి ఉన్న మాట వాస్తవమే. ఆమె ఆయన స్నేహితురాలు కాదట. కిడ్నాప్ కేసులో ఆమె పాత్ర కూడా ఉంది. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపినట్లు ఆంగ్ల మీడియా కథనం.

    ఛోక్సీ తన గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా గడిపేందుకు బోటు ద్వారా డొమినికా చేరుకుని ఉంటాడని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. అయితే ఆ అమ్మాయి ఛోక్సీ స్నేహితురాలు కాదని తెలుస్తోంది. అంటిగ్వాకు చెందిన ఆ యువతి ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఛోక్సీతో పరిచయం పెంచుకుని స్నేహం చేసిందని తెలుస్తోంది. మే 23న ఆమె ఛోక్సీకి ఫోన్ చేసి తన అపార్ట్ మెంట్ కు రమ్మని ఆహ్వానించింది. అక్కడకు వెళ్లిన ఛోక్సీని కొంతమంది వ్యక్తులు బలవంతంగా అపహరించినట్లు సమాచారం.

    మరోవైపు డొమినికా జైల్లో ఉన్న ఛోక్సీ ఫొటోలను అంటిగ్వా న్యూస్ రూం నిన్న విడుదల చేసింది. అందులో ఆయన చేతులు, కంటిపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను తీవ్రంగా కొట్టారని ఆయన న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో ఛోక్సీని ఆస్పత్రికి తరలించాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సోమవారం ఆయనను డొమినికా రాజధాని రొసెవులోని ఆస్పత్రిలో చేర్చారు.

    ఛోక్సీని భారత్ కు రప్పించేందుక కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇటీవల ఖతర్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం ఢిల్లీ నుంచి డొమినికాకు వెళ్లింది. ఛోక్సీ అప్పగింతపై అవసరమైన పత్రాలు ఆ విమానంలో వచ్చాయని ప్రధాని చెప్పారు. అయితే ఛోక్సి కేసుపై డొమినికా కోర్టు జూన్ 2న విచారణ జరపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగవేసిన కేసులో ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ నిందితులుగా ఉన్నారు.