సోనూ సూద్ నుంచి కేటీఆర్ కు ఊహించని స్పందన

కరోనా కల్లోలంలో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు సోనూ సూద్. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ దాకా ఇప్పటికీ సోనూ సూద్ తన సేవలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా సోనూ సూద్ చేస్తున్నాడు. ఏకంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎవరు ఏం కోరినా కూడా సోనూసూద్ దేశవ్యాప్తంగా తన టీంతో సేవలందిస్తున్నాడు. వారి కష్టాలు తీరుస్తున్నాడు. ఇక సోనూ సూద్ అంతకాకపోయినా.. […]

Written By: NARESH, Updated On : June 1, 2021 5:43 pm
Follow us on

కరోనా కల్లోలంలో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు సోనూ సూద్. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ దాకా ఇప్పటికీ సోనూ సూద్ తన సేవలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా సోనూ సూద్ చేస్తున్నాడు. ఏకంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఎవరు ఏం కోరినా కూడా సోనూసూద్ దేశవ్యాప్తంగా తన టీంతో సేవలందిస్తున్నాడు. వారి కష్టాలు తీరుస్తున్నాడు. ఇక సోనూ సూద్ అంతకాకపోయినా.. మంత్రి కేటీఆర్ తెలంగాణలోని సమస్యలపై, ఎవరైనా సాయం కోరితే తన కేటీఆర్ ఆఫీస్ ద్వారా అవన్నీ చక్కదిద్దుతున్నాడు.

ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, సోనూసూద్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పొగిడేసుకొని హాట్ టాపిక్ గా మారారు.

మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ కు వచ్చే సమస్యలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ అవసరం అయితే కేటీఆర్ సమకూర్చారు. అతడు తన కృతజ్ఞతను సోషల్ మీడియాలోనే తెలిపారు. కేటీఆర్ ను రియల్ హీరో అని పొగిడారు.

దీనికి కేటీఆర్ బదులిచ్చాడు. ‘తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి బాధ్యత నిర్వహిస్తున్నానని.. కానీ సోనూ సూద్ అలా కాదని.. ఆయనే రియల్ హీరో’ అని ప్రశంసించాడు.

మంత్రి కేటీఆర్ తనను పొగిడిన విషయాన్ని తెలుసుకొని సోనూసూద్ ఫిదా అయ్యాడు.తిరిగి కేటీఆర్ ను పొగిడారు. తెలంగాణ కోసం కేటీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని అభినందించారు.మీ పాలనలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందిందని.. నా రెండో ఇళ్లు తెలంగాణ అని.. అక్కడ మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవని కేటీఆర్ ను ఆకాశానికెత్తేశాడు సోనూసూద్. ఇలా పరస్పరం పొగడ్తలతో ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.