
పశ్చిమ బెంగాల్‌లో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీకి చెందిన ఒక కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. అయితే దీనిని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు కోల్‌కతాలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బెంగాల్‌లో అధికార పార్టీ దాడులు ఎక్కువయ్యాయని, బీజేపీ కార్యకర్తలు లక్ష్యంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలను చూసి అధికార పార్టీ ఓర్చుకోలేకపోతోందని, అందుకే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.