https://oktelugu.com/

నిహారిక పెళ్ళికి వాళ్ళను వద్దంది నాగబాబా ? పవనా?

రెండు రోజులుగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా కుటుంబ సభ్యులు వేడుకలు జరుపుకుంటున్నారు. నాగబాబు కూతురు నిహారిక వివాహ వేదిక అక్కడ ఏర్పాటు చేయడంతో, ప్రత్యేక విమానాలలో నిన్నే అక్కడికి చేరుకున్నారు. రేపు సాయంత్రం నిహారిక-చైతన్యల వివాహం కావడంతో నిన్న రాత్రి సంగీత్ నిర్వహించారు. ఈ సంగీత్ లో చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పాల్గొని కొత్త జంటతో కలిసి స్టెప్స్ వేశారు. చిరంజీవి నుండి వైష్ణవ్ తేజ్ వరకు మెగా […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 07:10 PM IST
    Follow us on


    రెండు రోజులుగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా కుటుంబ సభ్యులు వేడుకలు జరుపుకుంటున్నారు. నాగబాబు కూతురు నిహారిక వివాహ వేదిక అక్కడ ఏర్పాటు చేయడంతో, ప్రత్యేక విమానాలలో నిన్నే అక్కడికి చేరుకున్నారు. రేపు సాయంత్రం నిహారిక-చైతన్యల వివాహం కావడంతో నిన్న రాత్రి సంగీత్ నిర్వహించారు. ఈ సంగీత్ లో చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పాల్గొని కొత్త జంటతో కలిసి స్టెప్స్ వేశారు. చిరంజీవి నుండి వైష్ణవ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ నుండి ప్రతి ఒక్కరు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ప్రత్యేక అతిధి పవన్ నేడు లేదా రేపు ఉదయ్ పూర్ చేరుకోనున్నారని సమాచారం.

    Also Read: బిగ్ బాస్ : సోహెల్ – అరియానా మధ్యే.. !

    కాగా ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ పిల్లలు కనిపించక పోవడం గమనార్హం. పవన్ రెండవ భార్య రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్, ఆద్య పెళ్ళికి హాజరు కాలేదు. పవన్ తో విడిపోయిననాటి నుండి రేణూ దేశాయ్ మెగా ఫ్యామిలీ గడప తొక్కలేదు. ఆ ఇంటిలో జరిగిన ఏ ఒక్క వేడుకకు ఆమె హాజరు కాలేదు. అయితే పిల్లలు ఆద్య, అకీరా చిరంజీవి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. ఒకప్పుడు అమ్మ రేణూ తో పూణేలో ఉండే ఈ ఇద్దరు పిల్లలు, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా పెదనాన్న చిరంజీవి ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం రేణూ మకాం పూణే నుండి హైదరాబాద్ కి మార్చగా, ఆదివారం జరిగే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి వీళ్ళు వెళుతూ ఉండేవారు.

    ఆ మధ్య మెగా హీరోలతో అకీరా దిగిన ఫోటోలు బయటికి రావడం జరిగింది. పవన్ రేణూతో విడిపోయినా పిల్లలతో మాత్రం బంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోనే దానికి సాక్ష్యం. మరి అకీరా, ఆద్య చిరంజీవి, నాగబాబు కుటుంబాలతో ఇంత సాన్నిహిత్యం కలిగి ఉండగా, వారిని నిహారిక పెళ్ళికి ఎందుకు ఆహ్వానించలేదు అనేది ఆసక్తికర అంశం. చిరంజీవి కుటుంబంతో బీరకాయ పీచు సంబంధం ఉన్న వారిని కూడా గుర్తుపెట్టుకొని పిలిచిన నాగబాబు, వీరిని మరిచిపోయారంటే నమ్మలేం.

    Also Read: పెళ్లి చేసుకోలేదు.. డేటింగ్ మాత్రమే చేస్తున్నా !

    నిహారిక పెళ్ళికి పవన్ పిల్లలు ఆద్య, అకీరాలను నాగబాబు పిలవ కూడదు అనుకున్నడా లేక ఆయన పిలుస్తాను అంటే పవన్ వద్దన్నాడా అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ మెగా ఫ్యామిలీ ఆహ్వానించినా రేణూ మరియు పిల్లలు ఈ వివాహానికి హాజరు కాకూడదు అనుకోని కూడా ఉండవచ్చు. ఈ మూడు కండీషన్స్ లో ఏదో ఒకటి మాత్రం నిజం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్