ఉచిత వ్యాక్సిన్ పంపిణీకి కేబినెట్ ఆమోదం

బీహార్ లో ప్రజలకు కరోనా టీకాను ఉచితంగా ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలిచినా జేడీయూ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టలో పొందుపరిచిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇచ్చే విధంగా రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఉచిత టీకా పంపిణీకి […]

Written By: Suresh, Updated On : December 16, 2020 9:09 am
Follow us on

బీహార్ లో ప్రజలకు కరోనా టీకాను ఉచితంగా ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలిచినా జేడీయూ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టలో పొందుపరిచిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇచ్చే విధంగా రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఉచిత టీకా పంపిణీకి ఆమోదం తెలిపారు. సాత్ నిశ్చయ్ రెండవ విభాగానికి చెందిన ఎన్నికల హామీని నెరవేర్చనున్నట్లు నితీశ్ తెలిపారు. అలాగే తమిళనాడు, మరి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు.