జగన్, కేసీఆర్ దెబ్బ: హైకోర్టు సీజేలే మారిపోయారే? ఏంటి కథ?

ఒక ముఖ్యమంత్రులు తలుచుకుంటే ఏం జరుగుతుంది? ఏమైనా జరుగుతుంది.. దేశంలోనే పవర్ ఫుల్ న్యాయవ్యవస్థ.. వారు తలుచుకుంటే ప్రభుత్వాలను శాసించగలరు. చట్టాల్లో లొసుగులను చూసి ఆపగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. కానీ తొలిసారి ఏపీ సీఎం జగన్ న్యాయవ్యవస్థతో ఢీకొట్టారు. ఏకంగా ఇప్పుడు విజయం సాధించారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇందులో విజయం సాధించాడనే చెప్పాలి. Also Read: అమరావతికి సోము వీర్రాజు జై.. జగన్ ను టార్గెట్ […]

Written By: NARESH, Updated On : December 16, 2020 10:38 am
Follow us on

ఒక ముఖ్యమంత్రులు తలుచుకుంటే ఏం జరుగుతుంది? ఏమైనా జరుగుతుంది.. దేశంలోనే పవర్ ఫుల్ న్యాయవ్యవస్థ.. వారు తలుచుకుంటే ప్రభుత్వాలను శాసించగలరు. చట్టాల్లో లొసుగులను చూసి ఆపగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. కానీ తొలిసారి ఏపీ సీఎం జగన్ న్యాయవ్యవస్థతో ఢీకొట్టారు. ఏకంగా ఇప్పుడు విజయం సాధించారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇందులో విజయం సాధించాడనే చెప్పాలి.

Also Read: అమరావతికి సోము వీర్రాజు జై.. జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

తాజాగా సడెన్ గా తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేలు మారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎలా మారారు? ఎందుకు మారారు? కారణాలేంటనేదానిపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి గతంలో సంచలనం సృష్టించారు. చంద్రబాబు తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని.. కొందరితో కలిసి కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో వాపోయారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కొందరు జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుకు విన్నవించారు.

Also Read: తుదిదశకు చేరుకున్న టీపీసీసీ ఎంపిక.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి..!

న్యాయవ్యవస్థపై ఫైట్ మొదలు పెట్టిన ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బార్‌‌ అసోసియేషన్లు నిరసనలు తెలిపాయి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు కోర్టుకు ఎక్కారు.. సీఎం జగన్‌ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయమని తెలిపారు. న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ను రాజీనామా చేయాలంటూ లేఖ రాశారు. ఈ ఫైట్ లో న్యాయవ్యవస్థది పైచేయి అవుతుందా? సీఎం జగన్ వాదన నెగ్గుతుందా అనేది ఆసక్తిగా మారింది.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కూడా కరోనా లాక్ డౌన్ వేళ తెలంగాణ హైకోర్టు ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాం.. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ పథకాలపై , పనులపై ఎన్నో విమర్శలు చేసింది. ఏపీలో జగన్ సర్కార్ కు పడ్డ ఎదురు దెబ్బలు అంత కాకపోయినా మోస్తారు కేసీఆర్ కూడా తెలంగాణ హైకోర్టుతో ఇబ్బంది పడ్డారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే ఇద్దరు సీఎంలు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశాక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా సుప్రీం కోర్టు కోలిజియం భేటి అయ్యి తెలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లను బదిలీ చేయడం విశేషం. ట్విస్ట్ ఏంటంటే ఏపీ సీఎం జగన్ విమర్శలు గుప్పించిన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరిని ఏకంగా అప్రాధాన్యమైన చిన్న రాష్ట్రం సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి ఈ ఫైట్ లో జగన్, కేసీఆర్ లే గెలిచారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ లాబీయింగ్ తో ఇది సాధించారని పలువురు అంటున్నారు.