బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్చలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ‘బురేవి’ అని నామకరణం చేశారు. ఈ తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మొన్నటి వరకు నివర్ తుఫానుతో తీవ్ర నష్టం జరిగింది. తాజాగా బురేవి ఏ విధంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ తుఫానుతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More