Heavy Rains to AP: ఏపీకి( Andhra Pradesh) వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాకు వర్ష సూచన తెలిపింది విశాఖలోని వాతావరణ కేంద్రం. చాలా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదు అవుతుందని హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండం గా మారి.. తుఫాన్ గా ఏపీపై విరుచుకుపడే అవకాశం ఉంది.
– తీవ్ర తుఫాను దిశగా..
ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి తుఫాన్ గా అవతరించనుంది. ఈ నెల 30 అంటే రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర మధ్య తీరం దాటనుంది. పలు జిల్లాలపై దీని ప్రభావం ఉండనుంది. దీనికి దిత్వ తుఫానుగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. శనివారం ఉదయానికి తీరం దాటనుంది.
– దీని ప్రభావం కాస్త తో పాటు రాయలసీమపై ఉంది. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
– శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు పడతాయి. నెల్లూరు,,చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ.. ప్రకాశం,బాపట్ల, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..
– తుఫాన్ తీరం దాటిన తర్వాత నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు పడనున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి.
– సోమవారం ప్రకాశం, బాపట్ల గుంటూరు కృష్ణాజిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయి. కోనసీమ, ఉభయ గోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
– కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.