
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశ హాలులోకి వచ్చిన సభ్యులు ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సభ్యులు నివాళులర్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించింది. తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు అధికార వైసీపీ రెడీ అయింది. అయితే సర్కార్ చేసిన తప్పలను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత చంద్రబాబు నాయకుడు అసెంబ్లీకి వరి కంకులు పట్టుకొని వచ్చాడు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ మొత్తంగా 20 అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.