బ్రిటన్ విమానాలపై నిషేధాన్ని పొడిగించాలి : కేజ్రీవాల్

కోవిడ్-19 కొత్త స్ట్రెయిన్ మన దేశంలో వ్యాపిస్తున్నందువల్ల బ్రిటన్ నుంచి మన దేశానికి విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ గురువారం ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో కోవిడ్ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నందువల్ల బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. అతి కష్టం మీద కోవిడ్-19 పరిస్థితిని నియంత్రించగలిగామని, బ్రిటన్‌లో […]

Written By: Suresh, Updated On : January 7, 2021 4:43 pm
Follow us on

కోవిడ్-19 కొత్త స్ట్రెయిన్ మన దేశంలో వ్యాపిస్తున్నందువల్ల బ్రిటన్ నుంచి మన దేశానికి విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ గురువారం ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో కోవిడ్ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నందువల్ల బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. అతి కష్టం మీద కోవిడ్-19 పరిస్థితిని నియంత్రించగలిగామని, బ్రిటన్‌లో కోవిడ్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇటువంటి సమయంలో నిషేధాన్ని ఉపసంహరించి, మన ప్రజలను అపాయానికి గురి చేయడం ఎందుకని ప్రశ్నించారు.