https://oktelugu.com/

బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవాళ్లకు శుభవార్త.. ఫ్రీగా రూ. లక్ష ప్రయోజనాలు..?

మనలో చాలామందికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. గతంలో బ్యాంకులలో డబ్బులు దాచుకునే వారికి సేవింగ్స్ మొత్తంపై వడ్డీ ఎక్కువగానే వచ్చేది. అయితే గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీని భారీగా తగ్గించడంతో ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్లపై తక్కువ మొత్తంలో రాబడి లభిస్తోంది. కొంతమంది ఎక్కువ మొత్తంలో వడ్డీ పొందాలని ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా ఇతర స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2021 5:23 pm
    Follow us on

    FD
    మనలో చాలామందికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. గతంలో బ్యాంకులలో డబ్బులు దాచుకునే వారికి సేవింగ్స్ మొత్తంపై వడ్డీ ఎక్కువగానే వచ్చేది. అయితే గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీని భారీగా తగ్గించడంతో ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్లపై తక్కువ మొత్తంలో రాబడి లభిస్తోంది. కొంతమంది ఎక్కువ మొత్తంలో వడ్డీ పొందాలని ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా ఇతర స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

    Also Read: హోం లోన్ తీసుకునే వారికి బంపర్ ఆఫర్.. రూ.10,000 డిస్కౌంట్..!

    చాలామంది ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ మొత్తం వడ్డీ మాత్రమే లభిస్తుందని భావిస్తారు. కానీ ఫిక్స్ డ్ డిపాజిట్ వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని పలు ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన వాళ్లకు లక్ష రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. డీసీబీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

    Also Read: పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా లోన్ పొందే ఛాన్స్..?

    ఐసీఐసీఐ బ్యాంక్ లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఏకంగా లక్ష రూపాయల వరకు ఐసీఐసీఐ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుండగా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ లో తక్కువ మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పరిమిత కాలం మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. పై బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వాళ్లు అదనంగా డబ్బులు చెల్లించకుండానే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.