ఏపీ సీఎం జగన్ ను లాజిక్ తో కొట్టాడు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్ననే ట్విట్టర్ ద్వారా రామతీర్థ ఆందోళనపై ఒక ఘాటు లేఖ విడుదల చేసిన పవన్ కళ్యాన్ ఈరోజు కూడా అదే ఆన్ లైన్ సోషల్ మీడియా తన మనోగతాన్ని ఇంకొంచెం గట్టిగా విడుదల చేశాడు. ఈ సారి సీఎం జగన్ ఏం చేయాలో దిశానిర్ధేశం చేశాడు.
Also Read: అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ
రాష్ట్రంలో హిందూ ఆలయాల రక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు. అంతర్వేదిలో రథం దగ్గమైన ఘటన తర్వాత రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
ఇటీవల రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాల్ని ధ్వంసం చేశాక కూడా సీసీ కెమెరాలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మరీ మాట తప్పిందని పవన్ విమర్శించాడు. దూపదీప నైవేద్యాలకు నిధులివ్వని ప్రభుత్వం ఇప్పుడు సీసీ కెమెరాల బాధ్యత కూడా ఆలయాలపై నెట్టడం బాధ్యత నుంచి తప్పుకోవడమేనన్నారు.
Also Read: కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం
ఇలా జగన్ సర్కార్ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడుతుంటే.. ఆయన పార్టనర్ అయిన పవన్ కళ్యాణ్ మాత్రం ఆ వేడిని ట్విట్టర్ ద్వారా మాత్రమే రగిలిస్తుండడం విశేషంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్